Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల‌య్య రూల‌ర్ సెన్సార్ టాక్ ఏంటి..?

Advertiesment
బాల‌య్య రూల‌ర్ సెన్సార్ టాక్ ఏంటి..?
, బుధవారం, 18 డిశెంబరు 2019 (22:36 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం రూల‌ర్. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ నెల 20న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే.. ఈ మూవీ ట్రైల‌ర్‌కు అనుకున్నంత‌గా రెస్పాన్స్ రాలేదు. దీంతో రెండో ట్రైల‌ర్ రిలీజ్ చేసారు అది కూడా.. ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. దీంతో అస‌లు రూల‌ర్ ఎలా ఉంటుంది..? 
 
ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా..? లేదా..? అని బాల‌య్య అభిమానులు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. అయితే... సెన్సార్ స‌భ్యులు ఈ సినిమా చూసి క‌థ‌గా బాగానే ఉన్న‌ప్ప‌టికీ... ఫైట్స్ ఎక్కువ అయిన‌ట్టుగా ఫీల‌య్యార‌ట‌. మాస్ డైలాగ్స్, భారీ ఫైట్స్ ఇదంతా చూసి... పాత సినిమాని చూసిన ఫీలింగ్ క‌లిగింద‌ని చెప్పిన‌ట్టుగా ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. దీనికితోడు బాల‌య్య పోలీస్ గెట‌ప్‌లో స‌రిగా సెట్ కాలేద‌నే ఫీలింగ్ క‌లిగింద‌ట‌. బాల‌య్య మాత్రం త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడ‌ట‌. మాస్ ఆడియ‌న్స్ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేసేలా డైరెక్ట‌ర్ కె.ఎస్.ర‌వికుమార్ తెర‌కెక్కించార‌ట‌.
 
ఈ సినిమాకి క‌థ‌ను డైరెక్ట‌ర్ ప‌రుచూరి ముర‌ళీ అందించారు. ఈ క‌థ బాల‌య్య‌కు, కె.ఎస్. ర‌వికుమార్‌కు, సి. క‌ళ్యాణ్‌కు న‌చ్చ‌డంతో చాలా స్పీడుగా ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసారు. టీమ్ మాత్రం సినిమా బాలయ్య అభిమానుల‌కు ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. రూల‌ర్ రిజెల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింక్ త‌ర్వాత ప‌వ‌న్ చేసే సినిమా ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు