సుక్కు మళ్లీ ఆ హీరోతోనే ప్లాన్ చేస్తున్నాడా..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:41 IST)
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్... ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. బన్నీ- రష్మిక జంటగా నటిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా కారణంగా ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు.
 
సుకుమార్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగానే ఉన్నప్పటికీ... బన్నీ మాత్రం కరోనా కేసులు తగ్గేవరకు షూటింగ్ వద్దు అని చెప్పేసాడట. ఈ గ్యాప్‌లో సుకుమార్ ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేసాడని తెలిసింది. ఇంతకీ.. ఈ కథ ఎవరి కోసం అంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కోసమని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. గతంలో చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం చిత్రం రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడం తెలిసిందే.
 
ఈ మూవీ చరణ్‌ కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. అయితే.. చరణ్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్‌ చేసే సినిమా ఏంటి అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో సుకుమార్.. చరణ్‌‌కి కథ చెప్పనున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే... చరణ్‌ - సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావచ్చు. మరి.. ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments