Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోక్షజ్ఞ ఎంట్రీపై ఫోకస్ పెట్టిన బాలయ్య

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:11 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఇతడే అంటూ కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. త్వరలోనే ఎనౌన్స్‌మెంట్ ఉంటుందని ప్రచారం జరిగింది కానీ.. అలా జరగలేదు.
 
అయితే.. ఇటీవల కాలంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు రావడం... ఆ ఫోటోల్లో మోక్షజ్ఞ బాగా లావుగా ఉండటంతో ఇప్పట్లో మోక్షజ్ఞ రంగప్రవేశం ఉండదు అంటూ వార్తలు వచ్చాయి. 
 
అయితే... తాజా వార్త ఏంటంటే మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫోకస్ పెట్టారట. లాక్‌డౌన్ టైమ్‌లో తనయుడు కోసం కొన్ని కథలు విన్నారట. అంతే కాకుండా ఓ కథను ఫైనల్ చేసినట్టు సమాచారం.
 
మరోవైపు మోక్షజ్ఞ యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఎప్పటికప్పుడు యువదర్శకులతో బాలయ్య భేటీ అవుతున్నారని టాక్. బాలయ్య ప్రస్తుతం పెడుతున్న ఫోకస్ చూస్తుంటే.. 2021లోనే వారసుడు ఎంట్రీ ఉంటుందని గట్టిగా వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. నందమూరి అభిమానులకు పండగే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments