Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" విడుదల తేదీపై సరికొత్త ట్విస్ట్...

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (14:42 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే అలియా భట్, ఒవీలియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టును అత్యత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
ఇప్పటికే 75 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, కరోనా, లాక్డౌన్ కారణంగా మిగిలిన షూటింగును నిలిపివేశారు. ప్రస్తుతం చిత్రం యూనిట్ మాత్రం తమతమ ఇళ్లకే పరిమితమైవున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల తేదీపై నిర్మాత డీవీవీ దానయ్య సరికొత్త ట్విస్టును వెల్లడించారు. నిజానికి ఈ చిత్రం 2020 జూలై 30వ తేదీన విడుదల కావాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల రీత్యా ఈ చిత్ర విడుదలను వచ్చే యేడాది జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు. ఈ తేదీలో కూడా ఇపుడు సందిగ్ధత నెలకొంది. 
 
తాజాగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ, 'జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే అనుకున్నాం, అయితే లాక్డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలు కూడా ఉన్నాయి.  
 
ఇలాంటి కారణాలు వల్ల ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. 
 
ఇదే రోజున ప్రభాస్ నటించిన "బాహుబలి-2" చిత్రం కూడా థియేటర్లలోకి వచ్చి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎవరూ అందుకోలేనంత స్థాయిలో రికార్డులు నెలకొల్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments