Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ కోసం రష్మీని బుక్ చేసిన నిర్మాత శేఖర్ రాజు?!

Webdunia
మంగళవారం, 5 మే 2020 (09:54 IST)
బుల్లితెరపై తన మాటలతో, హావభావాలతో అద్భుతంగా రాణిస్తున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈమె అడపాదడపా వెండితెరపై కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో తన జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం ఏమేరకు ఉందో లేదో తెలియదుకానీ, బుల్లితెరపై వీరిద్దరి నటనకు బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా రష్మీ - సుధీర్ జంటకు బుల్లితెరపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. 
 
ఈ క్రమంలో వీరిద్దరూ కూడా వెండితెరపై తమని తాము నిరూపించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరినీ కలిసి వెండితెరపై చూడటానికి అభిమానులు ముచ్చటపడుతున్నారు. వాళ్ల కోరిక త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా, శేఖర్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సుధీర్ - రష్మీ జోడీగా ఒక సినిమా చేయాలనుందని నిర్మాత వ్యాఖ్యానించాడు. 
 
ఈ వ్యాఖ్యలను ఆయన నిజం చేసేలా సుధీర్ - రష్మీ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఇక వెండితెరపై ఈ ఇద్దరూ కలిసి చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే కరోనా తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments