కరోనా నేపథ్యంలో.. పేదలకు చపాతీ, రైస్, లేదంటే బిస్కెట్లయినా ఇస్తే మంచిదని యాంకర్ రష్మీ గౌతమ్ తెలిపింది. ''మనం ఇంట్లో మూడు పూటలు తింటున్నాం. పేదవారు మాత్రం తినట్లేదు.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ వారికి కాస్త ఆహారం అందిద్దాం'' అంటూ రష్మీ వెల్లడించింది.
'అన్నీ మనమే తినేయాలి. అన్నీ మనమే కొనుక్కుని పెట్టుకోవాలి అనుకుంటే కష్టం' అని ఆమె తెలిపింది. 'ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో' అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా కారణంగా.. కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై రష్మీ గౌతమ్ మండిపడింది. అన్ని దుకాణాలు బంద్‌లో ఉన్నాయి. పేదలకు ఫుడ్ దొరకట్లేదు. అందుకే వారికీ ఆహారం అందించాలని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది.