Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకు కొందరు భయపడటం లేదు.. ట్వీట్ చేసి తప్పు చేశాను.. రష్మీ

Advertiesment
కరోనాకు కొందరు భయపడటం లేదు.. ట్వీట్ చేసి తప్పు చేశాను.. రష్మీ
, శనివారం, 21 మార్చి 2020 (12:09 IST)
అనసూయ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న యాంకర్ రష్మినే. అయితే ఎప్పుడూ నెటిజెన్స్‌కి తగిన సమాధానం చెప్పే రష్మీ ఈసారి మాత్రం నెటిజెన్స్ చేతికి అడ్డంగా దొరికిపోయింది. ఇందుకు కారణం కరోనా వైరస్సే. కరోనా వైరస్‌కి భయపడి సినిమా షూటింగ్ దగ్గర నుండి, టివి సీరియల్స్ షూటింగ్స్ వరకు అంతా బంద్ చేస్తుంటే. రష్మీ మాత్రం.. రాజమండ్రిలోని ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్తున్నట్లు ట్వీట్ చేసింది. 
 
ఈ కార్యక్రమానికి వెళ్లిన రష్మీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. అప్పుడు పోలీస్‌లు ప్రజల్ని కంట్రోల్ చేసి భారీగా గుమికూడిన జనసందోహాన్ని అక్కడినుండి పంపేశారు. అయితే రష్మీ ఆ షాప్ ఓపినింగ్‌కి వస్తున్నట్టుగా ముందస్తుగా ట్వీట్ చెయ్యడం వలనే ప్రజలు కరోనా భయం లేకుండా అధిక సంఖ్యలో వచ్చారని. అందరూ అన్ని ఆపుకుని కూర్చుంటే నువ్వు మాత్రం షోరూం ఓపెనింగ్‌కి ఎలా వచ్చావ్ అంటూ నెటిజెన్స్ పెద్ద సంఖ్యలో రష్మిని ఆడుకున్నారు.
 
ఇక రష్మీ షోరూం ఓపెనింగ్ అయ్యాక నిజాయితీగా క్షమాపణలు చెప్పింది. కరోనాతో కొందరు భయపడడం లేదని.. అయినా ఇన్ని జాగ్రత్తలు అవసరమా అని, కొంతమంది బయట ఫుడ్ ఇష్టానుసారంగా తింటున్నారని తెలిపింది. వీరందరూ మారాలని.. తాను ట్వీట్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కరోనా విముక్త భారత్" కోసం చిరంజీవి పిలుపు (వీడియో)