Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ సరసన ఒకప్పటి కలలరాణి సిమ్రాన్..?

తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి.. కలలరాణిగా పేరు తెచ్చుకున్న సిమ్రాన్.. పెళ్లికి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా వుంది. ప్రస్తుతం విశాల్ నటించిన డిటెక్టివ్‌లో నటించిన సిమ్రాన్.. గతంలో చి

Webdunia
గురువారం, 5 జులై 2018 (17:28 IST)
తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి.. కలలరాణిగా పేరు తెచ్చుకున్న సిమ్రాన్.. పెళ్లికి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా వుంది. ప్రస్తుతం విశాల్ నటించిన డిటెక్టివ్‌లో నటించిన సిమ్రాన్.. గతంలో చిరంజీవి, నాగార్జున, అజిత్, బాలయ్య లాంటి అగ్రహీరోల సరసన ఆడిపాడింది. తాజాగా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న సిమ్రాన్.. త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించనుంది. 
 
ప్రస్తుతం రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం రజనీకాంత్‌ను డిఫరెంట్ లుక్‌లో కార్తీక్ సుబ్బరాజు చూపించనున్నాడని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో కథానాయికగా సిమ్రాన్‌ను తీసుకున్నారని సమాచారం. 
 
రీ ఎంట్రీ ద్వారా తన వయస్సుకు తగిన పాత్రలను పోషిస్తూ వస్తున్న సిమ్రాన్.. రజనీ సరసన కథానాయికగా నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేస్తోంది. ఏకధాటిగా ఈ సినిమా షూటింగును 40 రోజులపాటు డార్జిలింగ్‌లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ షూటింగ్‌లో సిమ్రాన్ పాల్గొంటుందని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, బాబీ సింహ, సంపత్ రాజ్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments