రూ.125 కోట్లతో సినిమా తీశారు.. రూ.6.20 కోట్లు అప్పు చెల్లించలేరా? రజినీ భార్యకు సుప్రీం చీవాట్లు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. "కొచ్చాడయాన్" సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన బ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. "కొచ్చాడయాన్" సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని ఆదేశించింది. రూ.125 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మించగా, రూ.6.20 కోట్ల రుణం చెల్లించలేరా? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు.
నిజానికి ఈ రుణాన్ని ఈ యేడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికీ రజినీ కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఈ వ్యవహారంపై స్పందించింది. యాడ్ బ్యూరో బకాయిలు ఎందుకు చెల్లించలేదు... ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలంటూ ఆదేశించింది.
కాగా, రజినీ కుమార్తె సౌందర్యా రజినీకాంత్ దర్శకత్వంలో రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన యానిమేషన్ చిత్రం కొచ్చాడయాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెల్సిందే.