Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవి శేష్ ఇన్‌వాల్వ్‌మెంట్..‌ శృతి హాసన్ ఔట్..!!

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (14:11 IST)
శ్రుతి హాసన్ ప్రభాస్ సలార్ మూవీ అనంతరం రజినీకాంత్ కూలీ సినిమాలోనటిస్తోంది. ఇదివరకే అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ చిత్రంలోనూ శృతి హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ షనైల్ డియో తొలిసారి దర్శకుడిగా రూపొందుతోన్న చిత్రమిది. 
 
తాజాగా ఈ సినిమా గ్లింప్స్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా డెకాయిట్ తెరకెక్కుతోంది. 
అయితే ఇప్పుడు శ్రుతి హాసన్ డెకాయిట్ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. డెకాయిట్ చిత్రీకరణ సగానికి పైగా పూర్తయ్యిందని తెలుస్తొంది. 
 
అయితే డేట్స్ ఇష్యూ వల్ల శ్రుతి హాసన్ డెకాయిట్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు.. ఆమె ప్లేస్​లో మరొక హీరోయిన్​ను మేకర్స్ వెతుకుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ షనైల్ డియో ఫ్యామిలీలో ట్రిప్‌కు విదేశాలకు వెళ్లిన క్రమంలో .. సినిమాలోని కొన్ని షాట్లను హీరో అడివి శేష్ తెరకెక్కించేందుకు ప్రయత్నించారని.. అది నచ్చకే.. శ్రుతి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి సిద్దమయినట్లు మరో ప్రచారం జరుగుతోంది.
 
డెకాయిట్  విషయానికొస్తే, ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడవి శేష్ గత చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి బ్లాక్​బస్టర్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన షనైల్ డియోను డైరెక్టర్​గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments