మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం టీజర్ క్రేజ్ తెప్పించిందా?

డీవీ
మంగళవారం, 15 అక్టోబరు 2024 (12:17 IST)
Vishwambhara views
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర చిత్రం టీజర్ దసరానాడు విడుదలైంది. సంక్రాంతికి సినిమా విడుదల అని ముందు ప్రకటించినా వాయిదా పడడంతో టీజర్ చూశాక ఇది పూర్తిగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్ పై ఆధారపడి వున్న సినిమా అర్తమైంది. మెగాస్టార్ శ్వేత గుర్రంపై చీకటిని ఛేదించుకుంటూ రావడం టెక్నికల్ షాట్ బాగుంది. టీజర్ మొదట్లోనే అవతార్ తరహా షాట్స్ కనిపించాయి. ఇదంతా విశ్వంలో జరిగే చెడు, మంచిలపై యుద్ధంగా కథ అనిపిస్తుంది. 
 
అయితే ఈ టీజర్ విడుదలయ్యాక 25 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా వచ్చాయి. కానీ సినిమాపై పెద్ద బజ్ రాలేదు. కారణం మార్కెట్ కాకపోవడమే, ఇది ముందుగానే తెలిసిన నిర్మాతలు సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. భోళాశంకర్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత చిరంజీవి నటించడం అనేది క్రేజ్ వచ్చినా, టీజర్ షాట్ లో ఎక్కడా ఎగ్జయిట్ మెంట్ అంశాలు కనిపించలేదు. దర్శకుడు వశిష్ట హాలీవుడ్ సినిమా స్పూర్తిగా తీసుకుని సినిమా చేసివుంటాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మార్కెట్ పెద్దగా కాకపోవడంతో సమ్మర్ కు వెళ్ళాలని, అందుకు బదులుగా సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చేలా ప్లాన్ చేసినట్లు సిని వర్గాలు తెలియజేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments