Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లెవెన్ లో శ్రుతిహాసన్‌ పాడిన ది డెవిల్ ఈజ్ వెయిటింగ్ సాంగ్ ను లాంచ్ చేసిన కమల్ హాసన్

devil song poster

డీవీ

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (17:39 IST)
devil song poster
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లెవెన్'. ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా ఈ సినిమా కోసం మల్టీ ట్యాలెంటెడ్ శ్రుతిహాసన్‌ పాడిన 'ది డెవిల్ ఈజ్ వెయిటింగ్' సాంగ్ ని రిలీజ్ చేశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఈ సాంగ్ ని లాంచ్ చేసి మూవీ టీంకి బెస్ట్ విషెస్ అందించారు.
 
కంపోజర్ డి.ఇమ్మాన్ ఈ సాంగ్ ని ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ తో టెర్రిఫిక్ నెంబర్ గా ట్యూన్ చేశారు. లోకేశ్ అజ్ల్స్ రాసిన లిరిక్స్ స్టొరీ, హీరో క్యారెక్టర్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేశాయి. శ్రుతిహాసన్‌ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఆమె వాయిస్ లిజనర్స్ ని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా, మ్యూజిక్ చార్ట్స్ లో ట్రెండ్ అవుతోంది.  
 
‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
 
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ, దర్శకుడు బాబీ సినిమా టైటిల్ ప్రకటన - దీపావళికి టీజర్