Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యాన్స్‌కు మరో షాక్, ఏంటది?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:20 IST)
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి సుజిత్‌తో, బాబీతో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
 
వీరిద్దరితో పాటు మెహర్ రమేష్‌‌తో కూడా చిరంజీవి చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు సామాన్య సినీ జనం కూడా మెహర్ రమేష్‌‌తో మెగాస్టార్ సినిమా చేయనున్నాడా..? అంటూ షాక్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవికి మెహర్ రమేష్‌తో సినిమా వద్దు అని చాలా మంది చెప్పారని... అందుచేత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
 
దీంతో మెగా ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారని...ప్రచారం జరిగింది. అయితే... ఇప్పుడు మరో షాక్. విషయం ఏంటంటే... మెహర్ రమేష్ - రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ అయ్యిందని టాక్. అవును... వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యిందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. అయితే... వీరిద్దరి కాంబినేషన్ సినిమా కోసం కాదని... వెబ్ సిరీస్ కోసమని సమాచారం.
 
మెగాస్టార్ తనయ సుస్మిత వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది. అలాగే చరణ్‌ కూడా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అందుచేత మెహర్ రమేష్‌ వెబ్ సిరీస్‌కి సరిపడ స్టోరీ చెప్పాడట. 
 
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ సక్సస్ అయితే... ఆ తర్వాత చిరుతో కానీ చరణ్‌‌తో కానీ మెహర్ రమేష్ సినిమా కన్ఫర్మ్ అవుతుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments