Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బిచ్చగాడు'' సీక్వెల్ రెడీ.. మరి శశి సంగతేంటి?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (17:28 IST)
తమిళంలో విడుదలైన పిచ్చైకారన్ సినిమా బిచ్చగాడు పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ద్వారా నటుడు విజయ్ ఆంటోనికి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. తల్లికోసం కొడుకు పడే వేదనను ఈ చిత్రంలో చూపించారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా విజయ్‌కి అటు తమిళంలోను ఇటు తెలుగులోను ఫుల్ పాపులారిటీతో పాటు నటుడిగా సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది. 
 
అయితే బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ నుండి కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఆ రేంజ్ సక్సెస్ కాలేకపోయాయి. ఇటీవలే విజయ్ ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సీక్వెల్ గురించి ప్రస్తావించారు. 
 
బిచ్చగాడు సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నానని చెప్పాడు. నాలుగు నెలల పాటు ఈ పని జరుగుతుందని.. స్క్రిప్టుకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే తారాగణంతో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తానని చెప్పాడు. 
 
మొదట్లో వచ్చిన బిచ్చగాడు చిత్రానికి దర్శకత్వం వహించిన శశి ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా ఉన్నాడట. మరి రాబోయే సీక్వెల్ డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ కథ ఎలా వుంటుందోనని విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.11,000 కోట్లు - హడ్కో ఆమోదం

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments