త‌మిళ హీరోతో సినిమా చేస్తోన్న‌ శేఖ‌ర్ క‌మ్ముల..!

ఆనంద్, గోదావ‌రి, హ్యాపీ డేస్, లీడ‌ర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక‌, ఫిదా.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ఫిదా సినిమాని తెర‌కెక్కించి ఘ‌న విజ‌యం

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (18:54 IST)
ఆనంద్, గోదావ‌రి, హ్యాపీ డేస్, లీడ‌ర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్,  అనామిక‌, ఫిదా.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ఫిదా సినిమాని తెర‌కెక్కించి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చి చాలా రోజులు అవుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కు శేఖ‌ర్ క‌మ్ముల నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేయ‌లేదు. దీంతో శేఖ‌ర్ క‌మ్ముల నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేస్తాడా అనుకుంటుంటే ఓ ఇంట్ర‌ెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అది ఏంటంటే... శేఖ‌ర్ క‌మ్ముల ఈసారి తెలుగు హీరో కాకుండా.. త‌మిళ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అవును.. ఇప్పుడు ఇదే చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఇంత‌కీ త‌మిళ‌ హీరో ఎవ‌రంటే.. చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ అని తెలిసింది. ప్ర‌స్తుతం ధృవ్ విక్ర‌మ్ త‌మిళ్‌లో అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీకి టైటిల్ వ‌ర్మ‌. 
 
ఈ మూవీతోనే ఆయ‌న త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇక తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల సినిమా ద్వారా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు‌, త‌మిళ్‌లో రూపొందించ‌నున్నారు. అయితే.. ఈ వార్త అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయాల్సివుంది. కొస‌మెరుపు ఏంటంటే.. ఈ చిత్రానికి నిర్మాత కూడా శేఖ‌ర్ క‌మ్ములే అని టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments