Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవికి నేనంటే ఇష్టం.. వాళ్లమ్మగారు ఎవ్వరితోనూ కలవనిచ్చేవారు కారు: రమాప్రభ

సీనియర్ నటి రమాప్రభ తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీదేవితో తనకున్న అనుబంధం గురించి రమాప్రభ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవికి తానెంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కలిస

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (18:39 IST)
సీనియర్ నటి రమాప్రభ తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీదేవితో తనకున్న అనుబంధం గురించి రమాప్రభ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవికి తానెంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కలిసి నటించాం. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కొంత అటాచ్‌మెంట్ ఏర్పడింది. కానీ తనతో ఎటాచ్‌మెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో శ్రీదేవి వాళ్లమ్మ తనకు దూరంగా వుంచేది. 
 
శ్రీదేవి హీరోయిన్ అయ్యాక కూడా వాళ్లమ్మగారు ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. అందుకు కారణం ఏమిటో తెలియదు. చిన్నప్పటి నుంచి శ్రీదేవికి సంతోషం అంటే ఏంటో తెలియదు. స్వతంత్రం వుండేది కాదు. పెళ్లికి ముందూ అంతే తర్వాత అదే పరిస్థితి. ఎప్పుడూ అందంగా డ్రెస్ చేసుకుని నటించడం తప్ప, వేరే లైఫ్ ఆ అమ్మాయికి ఎంత మాత్రం తెలియదని రమాప్రభ తెలిపారు. 
 
పెళ్లి అయిన తరువాత కూడా శ్రీదేవి అదే పరిధిలో వుండిపోయింది. అలాంటి శ్రీదేని చనిపోయిన వార్త విని చాలా బాధకలిగిందని.. చాలాకాలం నుంచే శ్రీదేవి జీవం లేని మనిషిలా తనకు అనిపించిందని రమాప్రభ వెల్లడించారు. 
 
అలాగే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, చలంతో కలిసి తెలుగు తెరపై రమాప్రభ చేసిన సందడి అంతా ఇంతా కాదని రమాప్రభ తెలిపారు. వందలాది సినిమాల్లో నటించినా.. ఎంతో పేరు తెచ్చుకున్నా తనకు పద్మశ్రీ ఇవ్వలేదని తెలిపారు. తన రేంజ్‌ అంతగా పెరగకూడదని పద్మశ్రీ ఇవ్వలేదని తెలిపారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన కారణంతో చాలామంది పక్కనబెట్టారు. అందుకే తనకేమైనా అయితే సినిమా వాళ్లకు చెప్పొద్దన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments