Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగం తీసిన సినిమా కథతో చైతు - సాయిపల్లవితో శేఖ‌ర్ క‌మ్ముల సినిమా...

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (20:25 IST)
అక్కినేని నాగ చైత‌న్య మ‌జిలీ సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. దీంతో చైతు రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు చైత‌న్య‌తో సినిమా చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. అయితే... ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. సెప్టెంబ‌ర్ నెలలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్లో బంగార్రాజు సినిమా, దిల్ రాజు బ్యాన‌ర్లో నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శితో ఓ సినిమా చేయాలి.
 
కానీ.. ఈ రెండు సినిమాల కంటే ముందుగా శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాని ఇంత అర్జెంట్‌గా ప్ర‌క‌టించ‌డం వెన‌క ఏం జ‌రిగింది అనేది ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే... శేఖ‌ర్ క‌మ్ముల నూత‌న న‌టీన‌టుల‌తో ఓ సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. తీరా అవుట్‌పుట్ చూసుకుంటే.. అస‌లు స‌రిగా రాలేదట‌. 
 
దీంతో డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల అసంతృప్తితో అప్ప‌టివ‌ర‌కు తీసింది అంతా ప‌క్క‌న పెట్టేయాలి అనుకున్నాడ‌ట‌. నిర్మాత‌ల‌కు చెబితే వాళ్లు కూడా ఓకే అన్నార‌ట‌. అప్పుడు ఈ క‌థ‌ని ఎవ‌రితో తీస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే... చైత‌న్య అయితే బాగుంటాడు అనుకోవ‌డం.. కాంటాక్ట్ చేయ‌డం.. చైత‌న్య విన్న వెంట‌నే ఓకే చెప్ప‌డం... డేట్స్ ఇవ్వ‌డం... అలాగే సాయి ప‌ల్ల‌వి కూడా ఓకే అన‌డం అంతా అలా అలా జ‌రిగింద‌ట‌. ఇది చైతు - శేఖ‌ర్ క‌మ్ముల సినిమా వెన‌కున్న అస‌లు క‌థ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments