Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమ్మక్ చంద్ర గురించి నాకంతా తెలుసు, స్వాతి నాయుడు గురించి సత్తిపండు

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:47 IST)
జబర్దస్త్‌లో బాగా పేరుపొందిన వ్యక్తుల్లో చమ్మక్ చంద్ర ఒకరు. అద్భుతమైన స్కిట్లతో కడుపుపుబ్బ నవ్వించే టీం చమ్మక్ చంద్ర టీం. ఈ టీంకు లీడరే చమ్మక్ చంద్ర. చంద్ర వచ్చాడంటే చాలు ఇక నవ్వుకోవాల్సిందే అంటుంటారు నాగబాబు, రోజా. అయితే ఉన్నట్లుండి జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర బయటకు వెళ్ళిపోవడం జరిగింది.
 
ఆ తరువాత కొన్ని సినిమాల్లో చమ్మక్ చంద్ర నటించాడు. ఇప్పడు ఇంకా ఎన్నో సినిమాల్లో చంద్రకు అవకాశాలు కూడా తన్నుకు వస్తున్నాయి. దీంతో బుల్లితెర మీద కాకుండా వెండితెరమీదే ఎక్కువగా కనబడాలని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడట చమ్మక్ చంద్ర.
 
అయితే చమ్మక్ చంద్ర టీంలో ఒకడిగా ఉన్న సత్తిపండు తాజాగా చంద్ర గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్ర అమ్మాయిలను వాడుకుంటున్నాడని..అవకాశాల పేరుతో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడని స్వాతినాయుడు ఆరోపించింది. అందులో ఎంతమాత్రం నిజం లేదు.
 
చమ్మక్ చంద్ర చాలా మంచి వ్యక్తి. అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు ఎవరైనా కనిపిస్తే వెంటనే తన జేబులో ఎంత డబ్బులుంటే అంతా ఇచ్చేసే మనస్తత్వం చమ్మక్ చంద్ర. అవకాశాల కోసం వచ్చే వారని తన సొంత అక్కాచెల్లెళ్ళతో సమానంగా చమ్మక్ చంద్ర చూస్తుంటాడు. అలాంటిది అతని మీద ఆరోపణలా..ఇప్పటికైనా మానండి అంటూ అతని స్నేహితుడు సత్తిపండు ప్రాధేయపడుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments