Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు మూడు భారీ చిత్రాలు ఫిక్స్

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:38 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు, పరశురామ్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మే 31న ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారని సమాచారం. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే... రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా అని ఎనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే.. మహేష్ - రాజమౌళి సినిమా దాదాపు రెండేళ్ల తరువాత ఆ  సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పుకుంటున్నారు. అప్పటి వరకూ మహేష్‌ బాబు మరో సినిమా చేయడేమోనని అభిమానులు నిరాశకి లోనయ్యారు కానీ... మహేష్‌ బాబు గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడని తెలిసింది. 
 
రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముందే పరశురామ్ సినిమా విడుదలైపోతుంది. రాజమౌళి సినిమాలో తన పోర్షన్ షూటింగు మొదలయ్యేసరికి అనిల్ రావిపూడి సినిమాను కూడా మహేష్‌ బాబు పూర్తి చేసే ఆలోచనలో వున్నాడు అంటున్నారు. ఈ ఏడాదిలో పరశురామ్ సినిమాను.. వచ్చే ఏడాదిలో అనిల్ రావిపూడి మూవీని .. 2022లో రాజమౌళి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్‌తో మహేష్‌ బాబు వున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇదే మహేష్‌ మూడు సినిమా ప్లానింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. నిజంగా ఇదేనా..? మధ్యలో ప్లాన్ మారుతుందా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments