Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ హీరోయిన్‌తో మహేష్‌ రొమాన్స్, ఇంతకీ ఎవరా హీరోయిన్..? (Video)

Advertiesment
ప్రభాస్ హీరోయిన్‌తో మహేష్‌ రొమాన్స్, ఇంతకీ ఎవరా హీరోయిన్..? (Video)
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:24 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం సాహో. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రధ్దా కపూర్ నటించింది. సినిమాను ఆస్వాదించాలంటే దానిలో భారీ యాక్షన్ సీన్స్, ఛేజింగులు, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటే సరిపోదు.. అంతకు మించి కథ, కథనం ఉండాలి. సాహో సినిమాకు ఇదే లోపంగా కనిపించింది. సినిమా చాలా రిచ్‌గా ఉంది.. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌ను ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూడలేదు. 
 
అయినప్పటికీ... భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ కలిగించింది. అయితే... ఇందులో కథానాయిక శ్రద్ధ కపూర్ పోలీస్ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారు. ప్రభాస్‌తో కలిసి స్టంట్లు బాగా చేశారు. మిగిలిన నటీనట వర్గమంతా తమ పాత్ర పరిధి మేర నటించారు. తెలుగు నటులు చాలా తక్కువ మంది ఉండటం సాహో సినిమాకి పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. సాహో సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ శ్రద్ధా కపూర్‌కి ఇప్పటి వరకు తెలుగులో అవకాశాలు రాలేదు.
 
అయితే... ఇప్పుడు చాలామంది బాలీవుడ్ భామలు టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇక్కడి కథలు, డైరెక్టర్ల పని తీరు మెచ్చి తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎందరో అందాల తారలు బాలీవుడ్ టు టాలీవుడ్ స్టెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే సాహో సినిమాతో తెలుగు చిత్రంలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్... ప్రభాస్ సరసన చిందులేసిన ఈమె తెలుగు ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ దక్కిందని తెలిసింది.
 
ఇంతకీ విషయం ఏంటంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాను గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పరశురామ్‌తో చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న డైరెక్టర్ పరశురామ్, మే నెలాఖరున పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ మూవీ స్టార్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి మహేష్‌ బాబుతో జోడీ కట్టే హీరోయిన్ ఎవరనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
 
సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మహేష్‌ మూవీలో నటించబోతుందా..? ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చచ్చిన పామును ఎన్నిసార్లు చంపుతారంటున్న హీరో