Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణుడు కోసం సమంత రూ.3కోట్లు ఇచ్చిందట

ఏ మాయా చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు, నటుడు, అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఇంటి కోడలైన సమంత పెళ్లి తరువాత కూడా

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (11:20 IST)
ఏ మాయా చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు, నటుడు, అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఇంటి కోడలైన సమంత పెళ్లి తరువాత కూడా నటనపై ఆసక్తి చూపుతోంది. ఎప్పటిలాగానే అమ్మడికి భారీ పారితోషికాలు అందుతున్నాయి. అయినా అక్కినేని కోడలు హోదాకు ఎలాంటి మచ్చ రానీయకుండా తన సినీ జీవితాన్ని సాఫీగా నడుపుతోంది.
 
కానీ సమంత మాత్రం అలా కాకుండా తను సంపాదిస్తోన్న దాంట్లో కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. తాజాగా అక్కినేని కోడలు తన మేనేజర్‌కు సాయపడిందట. ఎప్పటి నుంచో సమంత దగ్గర పనిచేస్తున్న మేనేజర్.. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా నారా రోహిత్‌తో బాలకృష్ణుడు అనే సినిమాను నిర్మించాడు. 
 
అయితే ఆ సినిమా రిలీజ్ చేయడానికి కొద్దీ రోజులే సమయం ఉండడంతో ఆయన సినిమా షూటింగ్ ఎండింగ్‌లో కాస్త డబ్బు లేక ట్రబుల్ అయ్యారట. దీంతో సమంత ఫైనాన్షియల్‌గా రూ.3 కోట్ల వరకు హెల్ప్ చేసిందట. ప్రస్తుతం ఇదే ఫిలిమ్ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మేనేజర్ ద్వారా సమంతకు సినిమాలు వచ్చాయని.. అలాంటి వ్యక్తి డబ్బు కోసం ట్రబుల్ అవుతుంటే చూడలేక సమంత అంత మొత్తాన్ని ఇచ్చిందని సినీ జనం అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments