సమంత.. మళ్లీ ఆ బ్యానర్లో సినిమా చేస్తుందా..? (video)

Webdunia
శనివారం, 23 మే 2020 (12:16 IST)
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుని.. అనతి కాలంలోనే ప్రేక్షక హృదయాలను దోచుకున్న కథానాయిక సమంత. ఇప్పటివరకు సమంత నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యుండచ్చు కానీ... ఆమె పాత్రలు మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు.
 
ఇంకా చెప్పాలంటే... ఏ మాయ చేసావే సినిమాలో జెస్సీ పాత్ర అయినా... రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర అయినా.. మజిలీలో శ్రావణి పాత్ర అయినా... ఓ బేబిలో బేబి పాత్ర అయినా... ఆమె తప్ప ఇంకెవరు అలా నటించలేరు అనేంతగా నటించి మెప్పించింది.. దటీజ్ సమంత అనిపించింది.
 
 అయితే... ఓ బేబి తర్వాత జాను సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలో నటించనుంది అనేది ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సమంత ఓ సినిమా చేయనున్నట్టు తెలిసింది. లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపొందే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ కథాంశంతో రూపొందే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది అనేది తెలియాల్సివుంది.
 
గతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాల్లో సమంత నటించింది. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో పాటు సమంతకు మంచి పేరు తీసుకువచ్చాయి మరి.. ఈసారి ఎలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుందో..? ఎవరి సరసన నటించనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments