Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. కౌగిలింత, కిస్ సీన్స్ కూడా తగ్గిపోతాయ్ (video)

Webdunia
శనివారం, 23 మే 2020 (11:33 IST)
కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్కులు, సోషల్ డిస్టన్స్ అంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు జనమంతా. ఇలాంటి పరిస్థితిల్లో లాక్‌డౌన్‌ తర్వాత సినిమా చిత్రీకరణలో పను మార్పులు చోటుచేసుకునే అవకాశం వుందని సినీ నటి సీరత్ కపూర్ అంటోంది. కౌగిలింత, ముద్దు సన్నివేశాలు తెరకెక్కించడం కూడా తగ్గిపోయే అవకాశమూ ఉందని చెప్తోంది. 
 
రన్‌ రాజా రన్, టచ్‌ చేసి చూడు, ఒక్కక్షణం, రాజుగారి గది 2, వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా, మా వింత గాథ వినుమా చిత్రాల్లో ప్రస్తుతం సీరత్‌ నటిస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత జరగబోయే షూటింగ్‌లు జరిగే తీరు గురించి సీరత్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇకపై గ్రూప్ డ్యాన్సర్లతో పాటలు చిత్రీకరించడం కష్టమవుతుందని చెప్పుకొచ్చింది. శానిటైజర్లు వాడటం, తరచుగా డాన్స్‌ గ్రూప్స్‌ని మార్చడం, షవర్లను ఏర్పాటు చేయటం వంటివి జరుగుతుంటాయని వెల్లడించింది. 
 
ఇంకా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి చర్యలు చేపడుతూ గ్రూప్‌ సాంగ్స్‌ చిత్రీకరించాల్సి ఉంటుంది. అంతేగాకుండా.. ముద్దుసీన్లు, లిప్‌లాకులు కూడా ఉండకపోవచ్చు. అయితే ఏ సినిమాలోనైనా ఇవి ఉండాలని ఆశిస్తారు. కరోనా కారణంగా ఈ అంశాల విషయంలో ప్రేక్షకులు కూడా సర్దుకుపోవాల్సిందేనని సీరత్ తెలిపింది. మొత్తానికి కరోనా మనకు చాలా నేర్పించిందని.. శుభ్రత విషయంలోనే కాదు బయట తినే తిండి విషయంలోనూ బోల్డెన్ని గుణపాఠాలు నేర్పిందని సీరత్ వెల్లడించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments