Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూటు మార్చి రెచ్చిపోతున్న సమంత - ఐటమ్ గర్ల్‌గా... (video)

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (19:06 IST)
టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్యతో మూడుముళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్న హీరోయిన్ సమంత ఇపుడు మరింతగా స్వేచ్ఛగా నటిస్తున్నారు. ఆమె రూటు మార్చి పాత పంథాలో పయనిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆమె ఐటమ్ సాంగ్‌లో నర్తించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. 
 
తాజాగా అల్లు అర్జున్ హీరోగా కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. 
 
అక్కినేని ఇంటి కోడలుగా ఉన్నంత కాలం మంచి పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వచ్చింది. పలు చిత్రాల్లో సమంత క్యారెక్టర్ చాలా సున్నితంగా, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. 
 
అయితే, చైతూతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మళ్లీ కమర్షియల్ జోన్‌లోకి వెళ్లిపోతోంది. ఇందులో భాగంగానే ‘పుష్ప’లో ఐటం సాంగ్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 
 
ఈ సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. అల్లు అర్జున్‌తో గతంలో "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమాలో సమంత నటించన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments