రంగస్థలం 1985 మార్చిలో విడుదల.. అజ్ఞాతవాసి, సైరానే కారణమా?

ప్రముఖ దర్శఖుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ బాబాయ్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుండటంతో అబ్బాయ్ వెనక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (17:09 IST)
ప్రముఖ దర్శఖుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ బాబాయ్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుండటంతో అబ్బాయ్ వెనక్కి తగ్గాడు. తాజాగా రంగస్థలం సినిమా విడుదల తేదీ మార్చి 16వ తేదీన రిలీజ్ కానుంది. 
 
సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ, సమంత నటిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. వచ్చేనెల పాటలను విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో  పాటల చిత్రీకరణ  కూడా వుంటుందని సమాచారం. అన్నీ పనులను ఫిబ్రవరిలో పూర్తి చేసుకుని మార్చి 16న సినిమాను విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇక రంగస్థలం ఫస్ట్ లుక్, ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
ఇకపోతే.. బాబాయ్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న తరుణంలో.. రంగస్థలంను చెర్రీ వాయిదా వేసినట్లు తెలుస్తుండగా,  మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి చిత్రానికి చెర్రీ నిర్మాత కావడంతో.. నటీనటుల ఎంపిక పనుల్లో బిజీగా వున్నారని.. అందుకే రంగస్థలం వాయిదా పడుతూ వస్తోందని సినీ జనం అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను మరణశయ్య పైనుంచి మామూలు మనిషిగా మార్చిన భర్త, శభాష్ - వీడియో

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య.. దోపిడి దొంగలని డ్రామా చేసింది..

ఆర్టెమిస్ సిబ్బందిని ప్రశంసించిన ట్రంప్.. అంగారక గ్రహంపై తదుపరి అడుగు (video)

ప్రజా మద్దతు చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం.. స్టాలిన్ ధీమా

నిద్రమత్తులో ప్రైవేట్ బస్సును నడిపాడు.. లారీ ఢీకొనడంతో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

తర్వాతి కథనం
Show comments