సమంత, చైతన్య ఆవిష్కరించనున్న 'మళ్ళీ రావా'

సుమంత్‌‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మాత. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారంనాడు సమంత, నాగచైతన్య సంయుక్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (16:14 IST)
సుమంత్‌‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మాత. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారంనాడు సమంత, నాగచైతన్య సంయుక్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత వెల్లడించారు. ఇటీవలే వైజాగ్‌లో ఆడియోను మధుర ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ.. చక్కటి ప్రేమకథా చిత్రమిది. 
 
'పెళ్లిచూపులు' తర్వాత ఇటువంటి కొత్త కథలు వస్తున్నాయి. ఇటీవలే వచ్చిన 'మెంటల్‌ మదిలో' ఇందుకు నిదర్శనం. ఆ కోవలోనే 'మళ్ళీ రావా' వుంటుంది. దర్శకుడు గౌతమ్‌ డెల్లాయిట్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. చాలా క్లారిటీతో కథను తనే రాసుకున్నాడు. తనలో రచయిత వున్నాడు. సుమంత్‌కు 'గోదావరి' తర్వాత అంత మంచి చిత్రమవుతుందని నమ్ముతున్నానని' తెలిపారు.
 
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఇటీవలే వైజాగ్‌లో విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. మధురంగా పాటలున్నాయి. డిసెంబర్‌ 8న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. నిర్మాత తెలుపుతూ... కథను తను ఏవిధంగా చెప్పాడో అదేవిధంగా తెరపై ఆవిష్కరించాడు. టేకింగ్‌ కొత్తగా వుంటుంది. సందర్భానుసారంగా పాటలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈరోజు సెన్సార్‌ పూర్తయింది. క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments