తెరపై ఎంతమంది వున్నా ఛాలెంజ్‌లు చేయడం, స్పష్టంగా మాట్లాడడం ఒక ఎత్తు. కానీ అదే రియల్‌లైఫ్‌లో వచ్చేసరికి ఆ స్పీడ్ వుండదు. రాజకీయనాయకులు వేలమంది వున్నా ఏం మాట్లాడాలనుకుంటారో అది చెప్పేస్తారు. తడబడటాలు వుండవు. కానీ సినిమా వాళ్ళకు అది ఫియర్ అనండి, లేదంటే నెర్వస్ అనండి. ఏదైనా కావచ్చు. కొంతమంది మాట్లాడేటప్పుడు తడబడతారు. అందులో రామ్‌చరణ్‌కూడా చేరాడు. గోదారరి జిల్లాలో నిన్నరాత్రి `ఉప్పెన` సక్సెస్‌మీట్ జరిగింది. షూటింగ్ అంతా పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఎలాగూ రామ్‌చరణ్ షూటింగ్ పనిలో అక్కడే వున్నారు.
సాయంత్రం ఫంక్షన్‌లో వేలాదిమంది నుద్దేశించి తన పక్కనే వున్న వైష్ణవ్‌తేజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, మాటలు ముద్దముద్దగా, ఫ్రీగా మాట్లాడలేకపోయారు. `వైష్ణవ్ యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మొదటి వ్యక్తుల్లో ప్రోత్సహించింది నాన్నగారు, కళ్యాణ్‌బాబాయ్. డాడీకి చిరంజీవిగారికి వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహించారు.
ఈ అబ్బాయికి ట్రైనింగ్ వేరే దేశాలకు పంపించారు. గురువులా నడిపించింది పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారు. అంటూ వెల్లడించారు. ఈ నాలుగు మాటలకు మాట్లాడడానికి కష్టపడి మాట్లాడినట్లుగా వుందని సెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి అలా మాట్లాడానికి ఇంకేమైనా కారణం వుందేమోనని గుసగుసలాడుతున్నారు.