రామ్‌చరణ్, ఉపాసన దంపతులు అప్పుడప్పుడు గొడవలు పడుతుంటారట. ఈ విషయాన్ని ఉపాసన కొణిదెల తెలియజేస్తుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను ట్వీట్ చేసింది. చరణ్‌తో వున్న ఎనిమిది సంవత్సరాలను తెలిపారు. అప్పడప్పుడు మా మధ్య సందర్భాన్ని బట్టి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటాం. నేను వ్యాపార రంగంతోపాటు సామాజిక సేవలో బిజీగా వున్నా, చరణ్ షూటింగ్లో బిజీగా వున్నా మా మధ్య ప్రేమకు కొదవలేదు.
కరోనా సమయంలో ప్రేమ మరింత బలపడింది. ఆమధ్య చరణ్ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ హృదయాకారంలో ఉన్న చెవి రింగులను తయారుచేయించి ఇచ్చాడు. చెర్రీని కలవడానికి సెట్‌కు వెళ్లగానే కారవాన్‌లో ఆ బహుమతి నాకు అందించాడు. అవి నాకెంతో ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పటికీ వదులుకోలేను.
అయితే వివాహబంధంలో చిన్న చిన్న గొడవలు సహజమే. అప్పుడే మరింత బలపడుతుంది. పెళ్లయి కొత్తలో చరణ్ గురించి పూర్తిగా మా అత్తగారిని అడిగి తెలుసుకున్నాను. వాడి కోపం నీటి మీద బుడగ లాంటిదని మా అత్తగారు అనేది. అత్తగారు కంటే అమ్మలాంటిదనే చెప్పాలి అని పేర్కొంది.