Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వర్మ మిస్సింగ్' - పవర్ స్టార్ ఏమయ్యాడు?

Webdunia
గురువారం, 30 జులై 2020 (20:47 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనా కష్టకాలంలో కూడా సినిమాలు తీస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టిస్తాడో ఊహించ‌డం క‌ష్ట‌మే. ఇటీవ‌లికాలంలో ఆర్జీవీ దూకుడును చూస్తే ఈ సంగ‌తి నిజ‌మేన‌నిపిస్తోంది. 
 
ఎందుకంటే వ‌ర్మ అంద‌రిలా ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయడు. ఒకేసారి కొన్ని సినిమాల‌ను లైన్‌లో పెడ‌తాడు. ఇది కేవ‌లం ఆర్జీవీకే చెల్లుతుంద‌నంలో ఎలాంటి సందేహం లేదు. అస‌లు విష‌యానికొస్తే ఇప్ప‌టికే ఆర్జీవీ సినిమాలు డిజిట‌ల్ ప్లాట్ ఫాంలో సంద‌డి చేస్తున్నాయి.
 
ఇప్పటికే క్లైమాక్స్‌, నేక్‌డ్, ప‌వ‌ర్ స్టార్ వంటి చిత్రాలు నిర్మించాడు. వీటిని ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాయి. తాజాగా వ‌ర్మ మ‌రో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి 'ఆర్జీవీ మిస్సింగ్' అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఓ విషయం చెప్పుకోవాలట. ఈ చిత్ర హీరో ఎవరోకాదు.. స్వయంగా రాంగోపాల్ వర్మేనట. 
 
షార్ట్ ఫిలింలాగా కాకుండా గంట లేదా అంత‌క‌న్నా ఎక్కువ నిడివితో ఈ చిత్రం ఉండ‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. ప్ర‌తీ వారం ఏదో ఒక సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించాల‌నుకున్న వ‌ర్మ చిత్రాల్లో ఆర్జీవీ మిస్సింగ్ ఉన్న‌ట్టు వినికిడి. 
 
థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్‌గా రానున్న ఈ చిత్రం మ‌రి సెట్స్ పైకి వెళ్లిందా..? లేదా షూటింగ్ షురూ కావాల్సి ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. వ‌ర్మ హ‌ఠాత్తుగా ఈ మూవీ ట్రైలర్‌ను చూపించి, సినిమా విడుద‌ల చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు. ఏది ఏమైనా ఆర్జీవీ స్పీడును అందుకోవాలంటే ఇప్పుడున్న ద‌ర్శ‌కుల‌కు క‌ష్ట‌మైన ప‌నే అని చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments