విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ చరణ్..?

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:04 IST)
విరాట్ కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్. విరాట్‌ కోహ్లి జీవితంపై బాలీవుడ్‌లో బయోపిక్‌ తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. విరాట్ కోహ్లీ పాత్రలో నటించేందుకు పలువురు బాలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. 
 
అయితే, ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విరాట్ కోహ్లీ బయోపిక్ రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో రామ్ చరణ్ తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని, అతని బయోపిక్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించారు. 
 
అయితే కోహ్లీ బయోపిక్ రైట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు. ధోనీ తన బయోపిక్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్మేశాడు. విరాట్ కోహ్లీ ఒక్కో సోషల్ మీడియా పోస్ట్‌కు రూ.8 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ధోనీతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీ క్రేజ్ ఎక్కువ. అందుకే విరాట్ కోహ్లీ తన బయోపిక్ రైట్స్ కోసం రూ.800 నుంచి రూ.1000 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. 
 
విరాట్ కోహ్లి ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌ను క్లైమాక్స్‌గా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. మరోవైపు, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించే గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments