Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓంకార్ ఆ.. నిర్ణ‌యం తీసుకున్నాడా..?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (22:47 IST)
యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం రాజు గారి గ‌ది 3. ఈ సినిమాకి రివ్యూస్ నెగిటివ్‌గా వ‌చ్చాయి. అయితే... క‌లెక్ష‌న్స్ మాత్రం ఫ‌ర‌వాలేదు అనిపించాయి. దీంతో ఓంకార్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఎందుకంటే.. రాజు గారి గ‌ది స‌క్స‌స్ అయ్యింది. ఆ ఉత్సాహంతో రాజు గారి గ‌ది 2 తీసారు. అందులో నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌డంలో ఫెయిల్ అయ్యింది.
 
 
తాజాగా తెర‌కెక్కించిన రాజు గారి గ‌ది 3 కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ఓంకార్ ఇక రాజు గారి గ‌ది సీక్వెల్స్ తీయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ట‌. స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డం ఓ కార‌ణ‌మైతే... ఈ సీక్వెల్స్ తీయ‌డానికి స‌రిపోయే క‌థ ఓంకార్‌కి సెట్ కావ‌డం లేదు. క‌థ‌ల కొర‌త‌గా బాగా ఉంది. అందుక‌నే రీమేక్‌ల‌పై ఆధార‌ప‌డుతున్నారు. 
 
రెండ‌వ పార్ట్ రాజు గారి గ‌ది 2కి మ‌ల‌యాళ చిత్రం ప్రీతంకి రీమేక్, రాజు గారి గ‌ది 3కి త‌మిళ కామెడీ చిత్రం థిల్లుకు థుడు 2 ఆధారంగా రూపొందించారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ఓంకార్ క‌థ‌ల కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో. కనుక.. ఇక రీమేక్‌ల‌పై ఆధార‌ప‌డి ప్లాప్ మూవీ తీయ‌డం క‌న్నా... ఈ సీక్వెల్స్‌ని ఆపేయ‌డం మంచిది అని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments