రాజుగారి గది 3 నుంచి తమన్నా సూపర్ ఎస్కేప్, ఎలా?

శనివారం, 19 అక్టోబరు 2019 (16:49 IST)
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ. ఎవరి గురించో తెలుసా? తమన్నా భాటియా గురించి. అదేదో సైరాలో నటించినందుకు అనుకునేరు. అదేంకాదండీ బాబూ. ఆమె నటించాల్సిన రాజుగారి గది3 నుంచి తప్పుకోవడంపైనే చర్చంతా. అసలు విషయం ఏమిటంటే, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 3 నిన్న శుక్రవారం నాడు విడుదలైంది. 
 
చిత్రం చూసినవారంతా అందులో తమన్నాకి బదులు నటించిన అవికాగోర్ పాత్రను చూసి పాపం అనుకుంటున్నారట. ఆ పాత్ర చూసాక తమన్నా చాలా తెలివిగా ఎస్కేప్ అయిందంటూ చెప్పుకుంటున్నారట. తమన్నా ఏమైనా చాలా తెలివిగల హీరోయిన్. ఓంకార్ స్టోరీ లైన్ చెప్పినపుడు ఓకే అనీ, కథంతా చెప్పాక ఆ చిత్రంలో తను నటించడం సాధ్యం కాదని బయటకు వచ్చేసింది. ఆమె అలా ఎందుకు బయటకు వచ్చిందో అవికాగోర్ పాత్రను చూశాక తెలుస్తుంది. తమన్నా కనుక ఆ పాత్రలో నటిస్తే వున్న క్రేజ్ అంతా గోదారిలో కలిసిపోయేదే అని చెప్పుకుంటున్నారు.
 
ఎందుకంటే రాజుగారి గది3 చిత్రంలో ఫోకస్ అంతా తన తమ్ముడు అశ్విన్ పైన పెట్టాడు. అశ్విన్ ఇందులో హీరోగా నటించడంతో తమ్ముడిని ఓ లెవల్లో నిలబెడదామని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అవికాగోర్ పాత్ర ఫట్ అయిపోయింది. ఎంతమాత్రం ఆకట్టుకోలేదు. అదే పాత్రను కనుక తమన్నా చేసి వుంటే ఆమె ఇమేజ్ ఏమైపోయేదో అని అనుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాహుల్ రాగానే ఆ పని చేస్తానంటున్న పున్ను.. టైటిల్ విన్నర్ అతడేనా?