Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కొత్త సినిమా 169 చిత్రం అప్డేట్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:07 IST)
Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు.  11 ఏళ్ల కింద వచ్చిన రోబో తర్వాత రజనీకాంత్ కు సరైన విజయం లేదు. రాను రాను తెలుగులో తలైవా సినిమాలకు తెలుగులో క్రేజ్ తగ్గతూ వచ్చింది. ‘రోబో’ తర్వాత తెలుగులో తలైవా చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ సాధించలేదు.  గతేడాది దీపావళి కానుకగా విడుదలైన  ‘పెద్దన్న’ మూవీ అంతంత మాత్రంగానే అనిపించింది. ఇక ఈ సినిమా తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది. తమిళనాడులో రజినీకాంత్‌ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే అనారోగ్యం కారణంగా సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పట్లో సినిమాల వైపు రారనే  ప్రచారం కూడా బాగానే జరిగింది. ఈ వార్తలు విన్న తర్వాత రజనీకాంత్ అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు.
 
 ఓ వైపు అనారోగ్యం వెంటాడుతున్నా.. మరోవైపు వరుసగా కమిట్‌మెంట్స్ ఇస్తున్నారు రజినీకాంత్. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్‌తో రజినీకాంత్ తన 169వ చిత్రం చేయబోతున్నారు. ‘కొలమావు కోకిల’, ‘వరుణ్ డాక్టర్’ తాజాగా విజయ్‌‘బీస్ట్’ సినిమా చేస్తున్న ఈ డైరెక్టర్ రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా రజినీకాంత్ .. పా రంజిత్, శివ, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు. తాజాగా ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments