A.R. Rahman, AR Amin, Rahima Rahman, Khatija Rahman
ప్రముఖ సంగీతదర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం పాశ్చత్య శైలిలోనే వుంటుంది. వినగా వినగా డెప్త్‌లోకి వెళితేకానీ అవి సామాన్యుడుకి ఎక్కవు. రోజా నుంచి ఆయన శైలి విభిన్నమైంది. సినిమా పాటల్లో తన ముద్ర వేసిన ఆయన పలు విదేశీ భాషల్లో పాటలు, సంగీతం కూడా సమకూర్చారు. వాటిలో వారి కుమారుడు, కుమార్తెలు కూడా పాలుపంచుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. `రోబో` సినిమాలో వారి కుమార్తెలు కూడా ఆలపించారు. తాజాగా ఉర్దూలో భాషలో పాడిన ఆల్బమ్ ఇటీవలే పూర్తయింది. దానికి సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా ఆయన తన కుమార్తెలు రహిమా రహ్మాన్, ఖతీజా రెహమాన్, కుమారుడు ఎ.ఆర్.అమీన్ తో కూడిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎక్స్ పో 20 దుబాయ్ ప్రెజెంట్స్ లో క్రియేటెడ్ డైరెక్టర్ శేకర్ కపూర్ ఆదర్శరర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ `రోబో` తరహాలో సాంగ్ వుంది. అరబ్ భాషతోపాటు ఆంగ్ల భాష మిళితమైన సాహిత్యం ఇందులో వుండడంతో వినేవారికి చాలా వినూత్నంగా అనిపిస్తుంది. `సిఫునా ఎన్‌జె ఎన్ జే ఉకు డేన్సా డేన్సా.. ` అంటూ అరబ్ సాహిత్యంతో సాగే ఈ పాట ప్రోమో విడుదల చేశాడు రెహమాన్. ఇందుకు ఆయన అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. కుటుంబంతో దిగిన ఫొటో పెట్టగానే వావ్! అంటూ రెహమాన్ శుభాకాంక్షలు చెప్పారు. చాలా రేర్ ఫొటో అంటూ మరికొందరు కితాబిచ్చారు. ఈ ఆల్బమ్ జనవరిలోనే రానుంది.