Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారుతోందా?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:19 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య  నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూస్తామా.. అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటే... ఈ సినిమా రిలీజ్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. 
 
2020లో జులై 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు జులై 30న రావడం లేదట. ఆర్ఆర్ఆర్ సినిమాని 2020లో జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని రాజమౌళి, నిర్మాత దానయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ... అఫిషియల్ గా ప్రకటించినప్పటికీ... షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్‌‌కి, ఎన్టీఆర్‌కి గాయాలు అవ్వడంతో కొన్నాళ్లు షూటింగ్‌కి బ్రేక్ పడింది. అందువలన షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదు. దీంతో ఈ మూవీ జులైలో ప్రేక్షకుల ముందుకు రావడం లేదని.. దసరాకి వస్తుందని వార్తలు వచ్చాయి. 
 
ప్రచారంలో ఉన్న వార్తలపై రాజమౌళి కానీ.. ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ కానీ స్పందించలేదు. దీంతో ఆర్ఆర్ఆర్ దసరాకి రావడం అనేది గాసిప్ అనుకున్నారు. ఈ వార్తల్లో నిజం లేదునుకున్నారు. 
 
అయితే... బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ పైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. రిలీజ్ డేట్ పైన తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఆర్ఆర్ఆర్ దసరాకి కూడా రావడం లేదట. 2021లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. కారణం ఏంటంటే.. షూటింగ్ చేయాల్సింది చాలా ఉందట. అందువలన దసరాకి రిలీజ్ చేయాలంటే పని ఒత్తడి బాగా పెరుగుతుందని... ఆలోచిస్తున్నారట. అందుచేత ఆర్ఆర్ఆర్ మూవీని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో రిలజ్ డేట్ పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments