Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్‌ బాబు.. ఇలాంటి ఐడియా ఇచ్చారా? షాక్ అవుతున్న ఫిల్మ్ లవర్స్

Webdunia
శనివారం, 16 మే 2020 (12:56 IST)
కరోనా కారణంగా సినిమా హాల్స్ మూసేయడం తెలిసిందే. అయితే... కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్‌కి రాలేదు. దీంతో కరోనాతో కలిసి బతకాల్సిందే అంటూ కేసీఆర్, జగన్, మోడీ చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా దీనికి అలవాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే... సినిమా హాల్స్ ఇప్పుడు తెరిచినా... జనాలు సినిమాని చూడడానికి వస్తారా..? రారా...? అనేది క్లారిటీ లేదు. ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు అని సినీ పండితులు చెబుతున్నారు. 
 
ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు జనాలను సినిమా థియేటర్స్‌కి రప్పించడం కోసం ఓ ఐడియాని సన్నిహితులుతో పంచుకున్నారని తెలిసింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే... సినిమా థియేటర్లో బీర్, బ్రీజర్ అమ్మితే ఎలా ఉంటుంది అనేదే ఆ ఆలోచన. ఈ విషయాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ బయటపెట్టారు.
 
అంతే కాకుండా... ఇది మంచి ఐడియానా..? కాదా? అని అడిగారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సామాన్య ప్రేక్షకులు, సినీ ప్రియులు ఇదేం ఆలోచన అంటూ షాక్ అవుతున్నారు. మద్యం బాబులు సినిమా థియేటర్‌కి వస్తే.. వాళ్లు ఎలాంటి హంగామా చేస్తారో తెల్సిందే. ఇదే కనుక జరిగితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి దూరం కావడం ఖాయం అంటున్నారు. మరి.. ఈ ఆలోచనపై సురేష్‌ బాబు స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments