Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి అక్కడ ప్లాన్ చేసాడా..?

Webdunia
శనివారం, 16 మే 2020 (12:45 IST)
ఊర మాస్ డైరెక్టర్ అంటే... ఠక్కున గుర్తుకువచ్చేది బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి సింహా, లెజెండ్ చిత్రాలు చేయడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో తాజా చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండడంతో ఆ రెండు పాత్రలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి ఏర్పడింది. అయితే... బాలయ్య ఇందులో అఘోరా పాత్ర పోషిస్తున్నారు అనే టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో.. ఈ సినిమా స్ర్కిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే... లాక్ డౌన్ తీసిన తర్వాత వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నప్పటికీ ఆర్టిస్టుల డేట్స్... లోకేషన్స్ సెట్ చేసుకోవడానికి టైమ్ పడుతుంది కాబట్టి ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకపోవచ్చు అని తెలిసింది. 
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమా షూటింగ్‌ను హిమాలయాల్లో ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. బాలయ్య అఘోరా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి... అఘోరా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను హిమాలయాల్లో చిత్రీకరించాలి అనుకుంటున్నారని తెలిసింది. బాలయ్య అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. అందరి అంచనాలకు తగ్గట్టుగా బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ సాథిస్తారో లేదో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments