Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 కోట్లకు పుష్ప-2 ఓటీటీ హక్కులు.. నిజమే?

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (21:49 IST)
పుష్ప 1: ది రైజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2021లో విడుదలైన ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 
 
పుష్ప పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది. 
 
ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ డీల్ గురించిన సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ 'పుష్ప 2: ది రూల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌తో ఈ ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫాం పుష్ప 2 హక్కుల కోసం పోటీ పడింది. అయితే సీక్వెల్ రైట్స్ కోసం మేకర్స్ నుంచి భారీ డిమాండ్ రావడంతో అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 
 
2021లో విడుదలైన "పుష్ప 1: ది రైజ్" సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 30 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ద రూల్’ హక్కులను నెట్‌ఫ్లిక్స్ మూడు రెట్లు ఎక్కువ చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
దాదాపు రూ.100 కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్లు సమాచారం. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ రావడంతో ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments