Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Zee5కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు గేమ్ ఛేంజర్

Advertiesment
game changer
, శనివారం, 30 సెప్టెంబరు 2023 (12:40 IST)
ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 
 
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక గేమ్ ఛేంజర్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు Zee5 కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు విక్రయించబడ్డాయి.
 
ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా, మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం సహజం. 
 
సీన్స్‌తో పాటు పాటల్లోనూ హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. ఏదైనా ఆలస్యం జరిగితే సినిమాను జనవరి 2025కి వాయిదా వేయవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూఖ్ ఖాన్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ సాధించిన హీరోగా రికార్డ్