సారీ ఇప్పుడు చేయలేను: పూజా హెగ్డే, ఏంటి?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (19:37 IST)
టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ కిరీటాన్ని మోస్తున్న బ్యూటీఫుల్ పూజా హెగ్డే అటు బాలీవుడ్ హౌస్‌ఫుల్ బాక్సాఫీస్ బ్లాస్ట్‌తో హ్యాపీ హ్యాపీగా ఉంది. రెండేళ్ళ వ్యవధిలో ఊహించని అవకాశాలు, విజయాలతో అందలం ఎక్కేసిన పూజా హెగ్డే కాల్షీట్ల కోసం టాలీవుడ్లో టాప్ నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
 
తను నటించిన సినిమాల్లో 80 శాతానికి పైగా హిట్ కొట్టడం పూజా హెగ్డే అదృష్టం. అంతేకాకుండా కొన్ని సినిమాలు పరాజయాలను చవిచూసినా చేసిన సినిమాలకు డబ్బులు మాత్రం అనుకున్న విధంగా వచ్చేశాయి. అందుకే పూజాహెగ్డే అంటే నిర్మాతలందరూ క్యూలు కడుతున్నారు. 
 
అయితే తన వద్దకు వచ్చే నిర్మాతలను నొప్పించక రెండు చేతులు పైకెత్తి దణ్ణం పెడుతూ అచ్చ తెలుగు అమ్మాయిలా క్షమించండి అంటూ చెబుతోందట పూజా హెగ్డే. కాల్షీట్లు ఖాళీలేవు. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. ఏమీ అనుకోకండి. మీ ప్రాజెక్టులో నేను ఇప్పుడు చేయలేనంటూ సున్నితంగా చెబుతోందట. 
 
స్టార్ హీరోయిన్‌గా ఉన్నా ఎక్కడా ఎలాంటి అహం లేకుండా నిర్మాతలతో పూజా హెగ్డే ప్రవర్తిస్తున్న తీరు వారిని బాగా ఆకట్టుకుంటోందట. అందుకే నిర్మాతలు పూజా హెగ్డే అంటే ఇప్పటికీ గౌరవమిస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోరును తీస్తున్నారా? జాగ్రత్త.. లేకుంటే ఇలాంటివి తప్పవు.. (video)

దారుణం, స్నానం చేస్తున్న ఏనుగుల మధ్య ఘర్షణలో చిక్కుకుని మహిళ మృతి, వీడియో

మే 22 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం విజయ్

35మంది ఉగ్రవాదులను హతమార్చిన పాకిస్తాన్ భద్రతా దళాలు

ఇంధన పొదుపు మంత్రం : 2 కిలోమీటర్లు నడిచిన సిక్కిం సీఎం తమాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments