Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్దే, అదిరిపోతుందట...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:49 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు పవన్.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు పవన్ ఓకే చెప్పారు. పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ కాంబినేషన్ పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... గతంలో పవన్ - హరీష్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచింది. అప్పటికే వరుస ప్లాప్స్‌లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయని.. పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటూనే చాలా ఎంటర్ టైనింగ్‌గా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
 
కాగా ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయకిగా బన్నీ హీరోయిన్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బన్నీ హీరో ఎవరంటారా..? దువ్వాడ జగన్నాథమ్, అల.. వైకుంఠపురములో సినిమాల్లో బన్నీ సరసన నటించి మెప్పించింది క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు పవన్ సరసన నటించనుందని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments