Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ షూటింగ్‌కి వచ్చేది ఎప్పుడు..?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (19:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకఫూర్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఇందులో అంజలి, నివేథా థామస్, అనన్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.
 
ఇన్ని రోజులు వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూసారు. ఇప్పుడు వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే.. పవన్ కళ్యాణ్ ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. పవన్ ఎప్పుడు షూటింగ్‌లో జాయిన్ అవుతాడు అంటే.. అక్టోబర్ నుంచి అని సమాచారం. ఇంకా పవన్ కళ్యాణ్ వర్క్ 20 రోజులు ఉంటుందని తెలిసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. 
 
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీకి సంబంధించిన వర్క్‌లో బిజీగా ఉన్నారు. నవంబర్‌కి షూటింగ్ కంప్లీట్ చేసేలా దిల్ రాజు ప్లాన్ చేసారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్లో సక్సెస్ సాధించిన పింక్ మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. వకీల్ సాబ్ ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments