Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ 'గజదొంగ'??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ 'గజదొంగ'??
, సోమవారం, 14 సెప్టెంబరు 2020 (13:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో దూకుడు పెంచాడు. వరుస చిత్రాల్లో చేసేందుకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్ చిత్రం పింక్ రిమేక్‌ను 'వకీల్ సాబ్' పేరుతో నిర్మిస్తున్నారు. వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు నిర్మిస్తున్నారు.
 
ఇదిలావుంటే, పవన్ మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించాడు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్నారు. పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఇటీవలె ఆ సినిమా గురించి ప్రకటన వచ్చింది. 
 
మొగల్ పరిపాలనా కాలానికి చెందిన ఈ కథలో పవన్ ఓ గజదొంగగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీకి 'విరూపాక్ష' లేదా 'బందిపోటు' 'గజదొంగ' అనే టైటిళ్ళను పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ క్రమలో తాజాగా మరో పేరు తెర మీదకు వచ్చింది. ఈ సినిమాకు 'ఓం శివమ్' అనే టైటిల్ పెట్టబోతున్నట్టు లేటెస్ట్ టాక్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా ఇంటిని కూడా కూల్చివేస్తారా? నోటీసులిచ్చిన బీఎంసీ?