Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత పేరు???

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (18:30 IST)
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ దందాలో ఇప్పటికే నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఆమె వద్ద జరిపిన విచారణలో అనేక మంది సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగా విచారణ ఎదుర్కొంటున్న జయసాహా వాంగ్మూలం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఎన్సీబీ ట్రాకింగ్‌లో జయసాహా, నమ్రత చాటింగ్ కూడా బయటపడినట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించగా... ప్రస్తుతం నమ్రత పేరు రావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అలాగే, బాలీవుడ్ న‌టి దియా మీర్జా పేరు కూడా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది. 2019లో దియా డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టుగా గుర్తించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఎన్సీబీ అధికారులు దియామీర్జా, ఆమె మేనేజ‌ర్ను విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. రానున్న కాలంలో ఇంకెంత‌మంది సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి. 
 
మరోవైపు, డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌లకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ మంగళవారంతో ముగిసింది. దీంతో వారికి స్థానిక న్యాయస్థానం ఆ కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించింది.
 
ఇదిలావుంటే, రియా, షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టులో వారి న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.
 
డ్రగ్స్ అభియోగాలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబరు 9న అరెస్ట్ చేశారు. సుశాంత్ కు రియానే డ్రగ్స్ సమకూర్చినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సిండికేట్‌లో రియా చక్రవర్తి ఒక యాక్టివ్ మెంబర్ అని ఎన్సీబీ భావిస్తోంది. ఈ కేసులో వరుసగా మూడ్రోజుల పాటు రియాను ప్రశ్నించిన ఎన్సీబీ ఆపై ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments