Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ తమిళ్ ఎఫెక్ట్.. తదుపరి ప్రధానమంత్రి ఓవియా.. మోదీ వెనక్కి?!

తమిళ బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు యమా క్రేజ్ వస్తోంది. ఈ బిగ్ బాస్‌తో పాల్గొన్న ఓవియా గురించే హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఓవియా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం తమిళనాడే కాదు.. దేశ వ్యాప్తంగా ఆమె గురించే మాట

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (14:57 IST)
తమిళ బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు యమా క్రేజ్ వస్తోంది. ఈ బిగ్ బాస్‌తో పాల్గొన్న ఓవియా గురించే హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఓవియా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం తమిళనాడే కాదు.. దేశ వ్యాప్తంగా ఆమె గురించే మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో సహ పార్టిసిపెంట్స్‌తో ఆమెకు జరిగిన వేధింపుల కారణంగా ఓవియా కన్నీళ్లు పెట్టుకుంది. ఆపై ఒత్తిడి కారణంగా ఆ షో నుంచి బయటికి వచ్చేసింది. 
 
అయినా ఓవియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓవియా పేరిట సోషల్ మీడియాలో ఓవియా ఆర్మీ అంటూ హ్యాష్ ట్యాగులున్నాయి. ఓవియాను తమ నాయకురాలిగా స్వీకరించిన కొందరు నెటిజన్లు.. ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోలుస్తూ.. ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఓవియా అభిమాని ఒకరు భారత తదుపరి ప్రధాన మంత్రి ఎవరనేదానిపై సర్వే నిర్వహించాడు. 
 
ఈ సర్వేలో ప్రధాని మోదీ, ఓవియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లు స్థానం దక్కించుకున్నాయి. ఈ సర్వేలో భారత ప్రధానిగా ఓవియాకు 86శాతం మంది ఓటేశారు. తద్వారా మోదీని ఓవియా వెనక్కి నెట్టింది. ఈ ఓటింగ్‌లో మోదీకి పదిశాతం ఓట్లు మాత్రమే దక్కాయి. రాహుల్ గాంధీకి 4శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఓటింగ్‌ను అనేకమంది షేర్ చేసుకుంటున్నారు.



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments