Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొనాల్డ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్‌కు వస్తున్నారు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆహ్వానించిన మేరకు ఆమె భారత్ విచ్చేయనున్నారు. న‌వంబ‌ర్‌లో హైదరాబాదులో జ‌ర‌గ‌నున్న గ్లో

Advertiesment
PM Narendra Modi
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (18:22 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆహ్వానించిన మేరకు ఆమె భారత్ విచ్చేయనున్నారు. న‌వంబ‌ర్‌లో హైదరాబాదులో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్ (జీఈఎస్‌)కు ఆమె హాజరు కానున్నట్లు సమాచారం. ఈ స‌దస్సుకు నాయ‌క‌త్వం వ‌హించాల్సిందిగా ప్ర‌ధాని మోడీ గ‌తంలో ఆమెను కోరారు.
 
తనకు ఈ అవకాశం కల్పించినందుకు ఇవాంకా, మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ త‌న భ‌ర్త జేరెడ్ కుష్న‌ర్‌తో క‌లిసి ట్రంప్‌కి స‌ల‌హాలివ్వ‌డానికే ఆమె ప్రాధాన్య‌మిస్తారు. స్వతహాగా ఆమెకు 300 మిలియన్ల డాలర్ల ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.
 
ఇందుకోసం ఆమెగానీ, తన భర్త గానీ ఎలాంటి జీతభత్యాలు తీసుకోవట్లేదు. భారతదేశంలో ఈ సదస్సుకు హాజరయ్యే అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని తనను మోడీ కోరినందుకు ఇవాంకా ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాముతో రైలెక్కిన ప్రయాణీకుడు..