Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాముతో రైలెక్కిన ప్రయాణీకుడు..

పెంపుడు జంతువులను రైళ్లలో, బస్సుల్లో తీసుకెళ్తుండటం మనం చూసేవుంటాం. కానీ కుక్కపిల్లను చంకలో పెట్టి తీసుకెళ్తున్నట్లు.. పామును చేతిలో పెట్టుకుని రైలెక్కాడు. ఈ ఘటన మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో చోటుచ

Advertiesment
పాముతో రైలెక్కిన ప్రయాణీకుడు..
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (17:43 IST)
పెంపుడు జంతువులను రైళ్లలో, బస్సుల్లో తీసుకెళ్తుండటం మనం చూసేవుంటాం. కానీ కుక్కపిల్లను చంకలో పెట్టి తీసుకెళ్తున్నట్లు.. పామును చేతిలో పెట్టుకుని రైలెక్కాడు. ఈ ఘటన మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. బోస్టన్ రైలులో ఓ వ్యక్తి పామును చంకలో పెట్టుకుని కూర్చున్నాడు. 
 
కానీ ఆ పాము కదులుతూ ముందుకు వచ్చేసింది. ఆ సమయంలో పాముతో వచ్చిన ప్రయాణీకుడిని చూసి అందరూ జడుసుకున్నారు. ఆ సమయంలో ఓ ప్ర‌యాణికుడు త‌న కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించాడు. ఇలా పామును బాక్స్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిందిపోయి ఇలా కుక్క‌పిల్ల‌ను తీసుకెళుతున్న‌ట్లు చంక‌లో పెట్టి తీసుకెళ్ళడం సరికాదని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మయుద్ధం కొనసాగుతుంది.. కమల్‌ హాసన్‌కు ఆ హక్కుంది: ఓపీఎస్