రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యా

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (14:50 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో పలువురు సినీ ప్రముఖులను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు పిలిచి విచారించిన విషయంతెల్సిందే. అయితే, ఈ విషయంలో సిట్ చీఫ్ అకున్ సభర్వాల్‌ను అందరూ బాహుబలితో పోలుస్తున్నారని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 సినిమా తీయాలని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. దీంతో డ్రగ్స్ కేసు వ్యవహారం ఒక్కసారి వేడెక్కింది. 
 
పోలీస్ అధికారుల్ని రెచ్చగొట్టడం మనకే మంచిదికాదంటూ మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీ రాజా అప్పట్లో వర్మకు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ ఆర్జీవీ తీరుమార్చుకోలేదు. అదేసమయంలో తెలుగు చిత్రసీమలో కొన్ని డ్రగ్స్ పురుగులు ఉన్నమాట వాస్తవమేనని, వాళ్లను మేమేదారిలో పెట్టుకుంటామని, ఇంతవరకూ జరిగిన సంఘటనలకు పరిశ్రమ బాధపడుతోందని తెలంగాణ ప్రభుత్వానికి మూవీ ఆర్టిస్టుల సంఘం, ఫిలిం ఛాంబర్ సంయుక్తంగా రాసింది. 
 
ఈ లేఖ మీద కూడా రాంగోపాల్ వర్మ అప్పుడే తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ ద్వారా తాము చెయ్యని తప్పును ఒప్పుకున్నట్లయిందని, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని వర్మ సోషల్ మీడియాలో కామెంటరీ ఇచ్చేశారు. దీంతో మూవీ ఆర్టిస్టుల సంఘం వర్మను ఎట్టిపరిస్థిల్లోనూ ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒక్కరు కాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments