Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ ప్రారంభమైతేనే.. అప్పటివరకు ఆశలుపెట్టుకోవద్దు: రాజమౌళి

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (13:21 IST)
దర్శక దిగ్గడం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). బాహుబలి తర్వాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేసింది. దీంతో ఈ చిత్రం షూటింగుకు బ్రేక్ పడింది. నిజానికి ఈ యేడాది జూన్ నెలలో ఈ చిత్రం విడుదల చేయాల్సివుంది. కానీ అది సాధ్యపడకపోవడంతో వచ్చే యేడాది వేసవికి వాయిదావేశారు. ఇపుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదికూడా సాధ్యపడేలా కనిపించడం లేదు. 
 
మరోవైపు, ఈ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు తగినట్టుగానే రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పటికే విడుదలైన రాం చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఈ సినిమాలోని ఫస్ట్‌లుక్, ప్రోమో అందరినీ అలరించాయి. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ లుక్ అదిరిపోయింది.
 
మరోహీరో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా తారక్‌ ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌ వస్తాయని అందరూ భావించగా తీవ్ర నిరాశే మిగిలింది. ఈ లుక్ వాయిదా పడడంతో ఇప్పుడు అభిమానులంతా దా‌ని కోసం ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు విడుదలవుతుందన్న విషయంపై రాజమౌళి స్పందించారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌.. కొమురం భీమ్ లుక్‌ను "ఆర్‌ఆర్‌ఆర్‌" షూటింగ్ మళ్లీ మొద‌లైన ప‌ది రోజుల అనంతరం విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. కరోనా కారణంగా షూటింగులు తిరిగి ప్రారంభం కావాల్సివుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments