Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డేకు సూపర్ ఛాన్స్.. జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. డీజేలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (13:34 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. డీజేలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా.. ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 
ఇకపోతే.. పూజా హెగ్డే ''సాక్ష్యం'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ''రంగస్థలం''లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో నటించనున్న పూజా హెగ్డే.. మహేష్ బాబు చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది.
 
ఇకపోతే.. ఎన్టీఆర్‍‌ ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గారు. ఈ క్రమంలో గత కొన్ని వారాలుగా ఎన్టీఆర్ వర్కౌట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా షూటింగ్ ముగిశాక, జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments